విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయినట్లే


Vijay devarakonda gets star status

విజయ్ దేవరకొండ మొదట చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. థియేటర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ అతడికి మొదట అంతగా ఛాన్స్ లు రాలేదు కానీ పెళ్లి చూపులు చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ ని తనవైపుకు తిప్పుకున్నాడు కట్ చేస్తే ఇప్పుడు గీత గోవిందం చిత్రంతో స్టార్ హీరోల రేంజ్ కు ఎదిగాడు. పెళ్లిచూపులు చిత్రం కంటే ముందుగా ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో నటించినప్పటికీ , ఆ పాత్ర విజయ్ దేవరకొండ కు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ దానికంటే ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించాడు. అందులో విజయ్ దేవరకొండ నటించడం ఏంటి అని అనుకుంటున్నారా ? కేవలం చిన్న పాత్ర మాత్రమే ఈ హీరో ది కాస్త నెగెటివ్ క్యారెక్టర్ కూడా. అసలు చాలామంది గుర్తు పట్టరు కూడా అంత చిన్న పాత్ర అన్నమాట విజయ్ దేవరకొండ ది.

కట్ చేస్తే పెళ్లిచూపులు చిత్రంతో ఈ హీరో జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో సంచలనం సృష్టించాడు . ఇంకేముంది ఇప్పుడు గీత గోవిందం తో స్టార్ హీరోల కేటగిరీలో చేరినట్లే ! గీత గోవిందం చిత్రానికి భారీ వసూళ్లు వచ్చి పడుతున్నాయి. ఓవర్సీస్ లో సైతం భారీ వసూళ్లు సాధిస్తూ నయా స్టార్ విజయ్ దేవరకొండ అనిపించేలా చేస్తోంది. మహేష్ బాబు, ఎన్టీఆర్ ల తర్వాత అంతటి స్టార్ డం విజయ్ దేవరకొండ కు వచ్చేలా ఉంది పరిస్థితి చూస్తుంటే . అయితే ఈ సమయంలోనే విజయ్ దేవరకొండ అప్రమత్తంగా ఉండాలి, కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఒకడు ఎదుగుతున్నాడంటే ఏడ్చే వాళ్ళు , కుట్ర చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి.

English Title: Vijay devarakonda gets star status