గెస్ట్ పాత్రలో విజయ్ దేవరకొండ


Vijay devarakonda going bollywood with 83 movie

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో ఓ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నాడు . అసలు విజయ్ దేవరకొండ ని బాలీవుడ్ లో పరిచయం చేయాలనీ దర్శక నిర్మాత కరణ్ జోహార్ పెద్ద ప్లాన్ వేసాడు కానీ అంతకంటే ముందే విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో అడుగు పెట్టేలా కనిపిస్తున్నాడు కాకపోతే కరణ్ జోహార్ సినిమా అయితే నేరుగా హీరోగా అవకాశం ఉండేది కబీర్ ఖాన్ సినిమా కాబట్టి జస్ట్ గెస్ట్ గా నటించడానికి ఒప్పుకున్నాడట .

కబీర్ ఖాన్ రూపొందించనున్న ” 83 ” చిత్రం 1983 ప్రపంచ కప్ నేపథ్యంలో రూపొందుతోంది . రణ్ వీర్ సింగ్ కపిల్ దేవ్ గా హీరో పాత్రలో నటిస్తుండగా విజయ్ దేవరకొండ తమిళనాడు క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది . శ్రీకాంత్ డ్యాషింగ్ ఓపెనర్ అన్న విషయం అందరికీ తెలిసిందే . విజయ్ దేవరకొండ క్రికెటర్ గా నటించే 83 చిత్రం తర్వాత కరణ్ జోహార్ సినిమాలో జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేయనున్నాడు విజయ్ దేవరకొండ .

English Title: Vijay devarakonda going bollywood with 83 movie