గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందన్న


క్రేజీ భామ రష్మిక మందన్న గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది . మహేష్ బాబు సరసన నటించే అదృష్టం సొంతం చేసుకుంది ఈ భామ . అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న అని ఇన్నాళ్లు వినిపించింది కానీ అది ఇప్పుడు నిజమే అని తెలుస్తోంది . కృష్ణ పుట్టినరోజు ఈనెల 31 న కావడంతో ఆ సందర్బంగా మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభం కానుంది .

ఈ ప్రారంభంలో మహేష్ బాబు పాల్గొనడు కానీ లాంఛనంగా మాత్రం ప్రారంభం అవుతుంది . దాంతో ఒక హీరోయిన్ గా రష్మిక మందన్న ని ఎంపిక చేశారట ! అంతేకాదు ఆ మేరకు రష్మిక కు అధికారికంగా చెప్పారట కూడా . షూటింగ్ ఇప్పుడు ప్రారంభం అయినప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కి మాత్రం సమయం పడుతుంది . ఇక ఈ సినిమాకు రెడ్డి గారి అబ్బాయి , సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్స్ ని అనుకుంటున్నారు . ఇంకా పక్కాగా ఏది ఫైనల్ కాలేదు . వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి .