బిగ్ బాస్ హౌజ్ లో విజయ్ దేవరకొండ


vijay devarakonda in bigg boss 2 houseబిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయ్యాడు హీరో విజయ్ దేవరకొండ . బిగ్ బాస్ 2 హౌజ్ లోకి సినిమా ప్రమోషన్ కోసం వెళితే ఆ సినిమా ప్లాప్ అన్న ముద్ర ఉంది ఇప్పటివరకు వెళ్లిన వాళ్ళ అన్ని సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి . అందుకే కాబోలు విజయ్ దేవరకొండ తన సినిమా ప్రమోషన్ కోసం ముందుగా వెళ్లకుండా సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత వెళ్ళాడు . ఇక ఆ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కానుంది . నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ బిగ్ బాస్ 2 ప్రేక్షకులను అలరిస్తోంది కానీ సినిమా వాళ్లకు మాత్రం అంతగా కలిసి రావడం లేదు .

గీత గోవిందం విడుదలై పెద్ద హిట్ అయిన దరిమిలా బిగ్ బాస్ 2 హౌజ్ లోకి వెళ్తున్నాడు కాబట్టి బిగ్ బాస్ 2 సెంటిమెంట్ అలానే ఉంది ఇంకా . బిగ్ బాస్ 2 లోకి ఎంటర్ అయితే అది ప్లాప్ అన్న ముద్ర ఉంది , అయితే అందుకు విజయ్ దేవరకొండ కు మాత్రమే మినహాయింపు ఉంది . ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్ల ని సాధిస్తోంది ఇక ఈరోజు ఆదివారం కాబట్టి చాలాచోట్ల హౌజ్ ఫుల్స్ అవ్వడం ఖాయం .

English Title: vijay devarakonda in bigg boss 2 house