రౌడీ క్లబ్ లో చేరమంటున్న విజయ్ దేవరకొండ


vijay devarakonda inviting fans into rowdy club

రౌడీ క్లబ్ లో మీ పేరు నమోదు చేసుకోండి అంటూ యువతకు సలహా ఇస్తున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో స్టార్ డం అందుకున్న హీరో విజయ్ దేవరకొండ . తాజాగా ”నోటా ” అనే చిత్రంలో నటిస్తున్నాడు . అయితే తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల రేసులో బెస్ట్ హీరోగా నిలిచాడు ఈ యంగ్ హీరో . అగ్ర హీరోలు చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , ఎన్టీఆర్ , ప్రభాస్ లతో పాటుగా విజయ్ దేవరకొండ ఉత్తమ హీరో కేటగిరీ లో పోటీపడుతున్నాడు .

దాంతో చాలా సంతోషంగా ఉన్నాడు విజయ్ . అగ్ర హీరోలు చిరంజీవి , బాలకృష్ణ , ఎన్టీఆర్ , వెంకటేష్ , ప్రభాస్ లతో పాటుగా నేను కూడా బెస్ట్ హీరో కేటగిరీ లో పోటీ పడటం అంటేనే అవార్డు గెలిచినంత సంతోషంగా ఉంది . ఇక ఆ అవార్డుల పోటీకి వెళ్ళడానికి నాతో పాటు ఒకరిని ఆ ఫంక్షన్ కు తీసుకెళ్తాను కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు ” www .rowdyclub. in ” లో వివరాలను పొందుపరచాలని , అలా పేర్లు నమోదు చేసుకున్న వాళ్లలో ఒకరిని ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్ కు తీసుకెళ్తానని అంటున్నాడు . అందువల్ల కుర్రాళ్ళు మీ వివరాలను వెంటనే రౌడీ క్లబ్ లో నమోదు చేయండి లక్కీ ఛాన్స్ కొట్టేయండి .