విజయ్ దేవరకొండ కొత్త సినిమా హీరో ప్రారంభం


క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం హీరో ఈరోజు ప్రారంభమైంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన మాళవిక నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకులు కొరటాల శివ క్లాప్ కొట్టగా పూజా కార్యక్రమాలతో హీరో చిత్రం ప్రారంభమైంది.

ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ లో రెండు సినిమాలు ఒప్పుకోగా తాజాగా మరో సినిమా కూడా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలకు సిద్ధం కాగా ఇక ఈ సినిమా మాత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది.