విజయ్ దేవరకొండ మార్కెటింగ్ స్ట్రాటజీ అదరహో


Vijay devarakonda
Vijay devarakonda

విజయ్ దేవరకొండ మార్కెటింగ్ స్ట్రాటజీ తో అదరగొడుతున్నాడు . పక్కా బిజినెస్ మెన్ లా వ్యవహరిస్తూ డియర్ కామ్రేడ్ ని బాగా సేల్ అయ్యేలా చేస్తున్నాడు . డియర్ కామ్రేడ్ చిత్రాన్ని ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ , కన్నడ , మలయాళ బాషలలో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఇలా సౌత్ ఇండియాలోని నాలుగు బాషలలో రిలీజ్ చేయడం ద్వారా తన మార్కెట్ ని సౌత్ మొత్తం వ్యాపించేలా ప్లాన్ చేస్తున్నాడు .

ఇప్పటికే అన్ని బాషలలో ఓ చుట్టు చుట్టేశాడు కాగా సినిమా రిలీజ్ దగ్గర పడటంతో మరోసారి అన్ని రాష్ట్రాలు చుట్టేస్తున్నాడు . ఆయా బాషలలో ఎవరు ఫేమస్ గా ఉన్నారో వాళ్ళని గెస్ట్ లుగా పిలుస్తూ తన సినిమాకు ప్లస్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు . ఈనెల 26 న డియర్ కామ్రేడ్ విడుదల అవుతుండటంతో ప్రమోషన్ జోరు పెంచాడు . ఈ సినిమా హిట్ అయితే ఇక పై తన ప్రతీ సినిమాని నాలుగు బాషలలో విడుదల చేయనున్నాడు .