విజయ్ దేవరకొండతో కియారా అద్వానీ?

Vijay Devarakonda And Kiara Advani
విజయ్ దేవరకొండతో కియారా అద్వానీ?

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ అనతికాలంలోనే స్టార్ హీరో అయ్యాడు. డియర్ కామ్రేడ్ తరువాత ఆయన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే..!

స్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబరులో ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తోందని రకరకాల పుకార్లు వచ్చాయి. అయితే జాన్వీ తిరస్కరించడంతో ఇంకా పలు హీరోయిన్స్ పేర్లుని పరిశీలిస్తున్నారు చిత్ర యూనిట్.

అయితే తాజాగా విజయ్ దేవరకొండ, కియారా అద్వానీ ఇద్దరు కలిసిన దిగిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తోందని సినీ అభిమానులందరు వూహించుకుంటున్నారు.. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే .. వీళ్లిద్దరు కలిసి మెబాజ్ వరల్డ్ అనే బట్టల షాప్ కి బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. దీనికోసం ముంబయ్ లో షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ సందర్భంలో తీసిన ఫొటోస్ హాట్ టాపిక్ గా మారాయి. త్వరలోనే ప్రమోషన్ యాక్టీవిటీస్ జోరుగా చేయనున్నారు. త్వరలోనే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా కూడా వస్తే అది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని ఆశిద్దాం..!!