హిట్ కాంబినేషన్ హ్యాట్రిక్ కోసం మరోసారి..

Vijay Devarakonda And Nag Ashwin
హిట్ కాంబినేషన్ హ్యాట్రిక్ కోసం మరోసారి..

టాలెంటెడ్ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సెట్స్ పై ఉన్నవి కాక కొత్త సినిమాలకోసం విజయ్ ను సంప్రదిస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో కలిసి పనిచేసే ప్రాజెక్ట్ కు స్క్రిప్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఇదివరకు ఎవడె సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాలు వచ్చాయి.

ఎవడె సుబ్రహ్మణ్యం నాగ్ అశ్విన్ కు దర్శకుడిగా మొదటి సినిమా కాగా, విజయ్ దేవరకొండకు గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం. అలాగే మహానటిలో విజయ్ దేవరకొండ పాత్ర కీలకం కాగా నాగ్ అశ్విన్ కు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఇటీవలే జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఈ ఇద్దరు మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఒక కొలిక్కి రావడంతో త్వరలోనే పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం.