విజయ్ దేవరకొండ ఫ్లాప్ దర్శకుడితో


Vijay devarakonda new movie with flop director

విజయ్ దేవరకొండ తాజా చిత్రం ఈరోజు ప్రారంభం కానుంది . అది కూడా ఫ్లాప్ దర్శకుడితో కొత్త సినిమా ప్రారంభించడానికి సమాయత్తం అయ్యాడు . ఉంగరాల రాంబాబు వంటి ఫ్లాప్ చిత్రానికి దర్శకత్వం వహించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటించనున్నాడు విజయ్ దేవరకొండ . ఇటీవలే నోటా తో ఫ్లాప్ ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ తాజాగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో విభిన్న తరహ పాత్ర పోషించనున్నాడట . ఇందులో విజయ్ దేవరకొండ సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు . రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ , ఇసా బెల్లె ది అనే ముగ్గురు భామలు విజయ్ తో రొమాన్స్ చేయనున్నారు .

మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు వంటి లవ్ ఎంటర్ టైనర్ ని తీసాడు క్రాంతి మాధవ్ , అయితే ఆ తర్వాత చేసిన ఉంగరాల రాంబాబు ఫ్లాప్ అయ్యింది . దాంతో విజయ్ తో రొమాంటిక్ లవ్ స్టొరీ ని తీయడానికి రెడీ అయ్యాడట . ఈ రొమాంటిక్ లవ్ స్టొరీ కోసం ముగ్గురు భామలను తీసుకున్నారు . ముగ్గురు అందమైన భామలతో విజయ్ దేవరకొండ రొమాన్స్ ఎలా ఉంటుందో అది తెరమీదే చూడాలి . గీత గోవిందం చిత్రంతో రికార్డుల మోత మోగించిన ఈ హీరో నోటా తో దెబ్బతిన్నప్పటికీ మళ్ళీ పుంజుకుంటానని అంటున్నాడు . ప్రముఖ నిర్మాత కే ఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు .

English Title: Vijay devarakonda new movie with flop director