విజయ్ దేవరకొండతో 2 సినిమాలు చేస్తాడటVijay devarakonda next with mahanati banner

విజయ్ దేవరకొండ ఇప్పుడు హాట్ కేక్ అయ్యాడు అందుకే అతడితో సినిమాలు చేయాలని పలువురు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. గీత గోవిందం ఇచ్చిన భారీ సక్సెస్ తో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ . ఇక ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ పతాకంపై ఇప్పటికే విజయ్ దేవరకొండ 2 సినిమాలు చేశాడు. ఒకటేమో ఎవడే సుబ్రహ్మణ్యం కాగా మరొకటి మహానటి . ఈ రెండు చిత్రాల్లో కూడా విజయ్ దేవరకొండది గెస్ట్ పాత్రలే ! అలాగే రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కట్ చేస్తే ఇప్పుడు అదే వైజయంతి బ్యానర్ లో మరో రెండు చిత్రాలు చేయడానికి అడ్వాన్స్ పుచ్చుకున్నాడు ఎప్పుడో ! కట్ చేస్తే …… ఇప్పుడు ఆ సమయం రానే వచ్చిందట .

విజయ్ దేవరకొండతో 2 సినిమాలు చేయడానికి ఒప్పందం చేసుకున్నామని అందులో ఒకటి సెట్స్ పై ఉందని , దాని తర్వాత మరో చిత్రం కూడా ఉంటుందని తెలిపాడు అగ్ర నిర్మాత చలసాని అశ్వనీదత్. గీత గోవిందం చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ పెరిగింది, అంతకుముందు అతడు తీసుకునే రెమ్యునరేషన్ వేరు , ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ వేరు . అలాగే మేకింగ్ లో కానీ బిజినెస్ లో కానీ మొత్తంగా దేవరకొండ రేంజ్ పూర్తిగా మారిపోయింది. మహానటి వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తర్వాత దేవదాస్ అనే చిత్రాన్ని నిర్మించారు అశ్వనీదత్ . నాగార్జున , నాని హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

English Title: Vijay devarakonda next with mahanati banner