గీత గోవిందం ని రిజెక్ట్ చేద్దామనుకున్నాడట


vijay devarakonda not intrested firtly on geetha govindam గీత గోవిందం తాలూకు కథ చెబుతానని దర్శకులు పరశురామ్ హీరో విజయ్ దేవరకొండ ని అడిగినప్పుడు ముందే కథ వినకుండా రిజెక్ట్ చేద్దామనుకున్నాడట అయితే ఒక్క క్షణం ఆలోచించి కథ విన్నాకా నో చెబుదామని , డేట్స్ ఖాళీ లేవని చెబుదామనుకున్నాడట అందుకే కథ విన్నాడట విజయ్ దేవరకొండ . మొదటిసారి కథ విన్నప్పుడు పెద్దగా ఫీలింగ్ కలగలేదట దాంతో మళ్ళీ రెండోసారి కథ విన్నాడట అప్పుడు మాత్రం కథలో ఏదో విషయం ఉంది తప్పకుండా చేద్దామని అనుకున్నాడట అందుకే డేట్స్ ఇచ్చాడట ! కట్ చేస్తే ఎవరూ ఊహించని విధంగా భారీ వసూళ్లు సాధిస్తూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది గీత గోవిందం చిత్రం .

అసలు సినిమా చేయకూడదని అనుకోని , కథ విన్నాక ఏదో చేద్దామని అనుకుంటే చూడు ఎంతలా హిట్ అయ్యిందో దాంతో ఎవరికి రాసి పెట్టి ఉంటే వాళ్ళు వద్దని అనుకున్నా కుదరదు అనడానికి ఇదే నిదర్శనం . ఇక విజయ్ దేవరకొండ కు అనూహ్యమైన ఇమేజ్ వచ్చింది పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో దాంతో ఈ చిత్రానికి భారీ వసూళ్లు వస్తున్నాయి . మొత్తానికి విజయ్ దేవరకొండ స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగాడు .

English Title: vijay devarakonda not intrested firtly on geetha govindam