వాయిదాపడుతున్న విజయ్ దేవరకొండ నోటా


Vijay devarakonda NOTA postponed

అక్టోబర్ 4న విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రాన్ని విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యారు కట్ చేస్తే డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా పెండింగ్ పనులు ఉండటం వల్ల అక్టోబర్ 4న విడుదల చేయడం కష్టమే అని అంటున్నారు . దాంతో రెండు వారాల గ్యాప్ లో అంటే అక్టోబర్ 18న నోటా ని విడుదల చేయాలనీ భావిస్తున్నారట దర్శక నిర్మాతలు . నెలరోజుల కిందటే అట్టహాసంగా రిలీజ్ డేట్ ప్రకటించారు కట్ చేస్తే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాయని అందుకే వాయిదా అని అంటున్నారు . అయితే తెరవెనుక ఏదో జరిగిందని అందుకే అక్టోబర్ 4 కు బదులుగా 18 న నోటా వస్తొందని కూడా వినిపిస్తోంది .

విజయ్ దేవరకొండ తెలుగు , తమిళ బాషలలో చేస్తున్న తొలిచిత్రమిది . ఇప్పటివరకు తెలుగు వాళ్లకు మాత్రమే స్టార్ గా ఉన్న విజయ్ ఈ సినిమాతో తమిళనాట కూడా స్టార్ హీరో అయిపోవడం ఖాయమని అంటున్నారు . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడం , తమిళనాట రాజకీయంగా తీవ్ర గందరగోళ పరిస్థితులు ఉండటం వల్ల నోటా అక్కడ సంచలనం సృష్టించడం ఖాయమని ధీమాగా ఉన్నారు . విజయ్ దేవరకొండ సరసన మెహరీన్ కౌర్ , సంచనా నటిస్తుండగా నాజర్ , సత్యరాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు . ఆనంద్ శంకర్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించాడు .

English Title: Vijay devarakonda NOTA postponed