అవార్డు ని అమ్మేస్తానంటున్న విజయ్ దేవరకొండ


vijay devarakonda ready to sell his filmfare award for CM relief fundఅర్జున్ రెడ్డి చిత్రంలోని నటనకు గాను విజయ్ దేవరకొండ ని ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు వరించింది , ఆ అవార్డు ని అందుకున్న ఈ హీరో దాన్ని అమ్మెయ్యాలని నిర్ణయించుకున్నాడు . ఈ అవార్డు ని ఎందుకు అమ్మాలని అనుకుంటున్నాడో తెలుసా …… తెలంగాణ ప్రభుత్వానికి విరాళం ఇవ్వడానికి . అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం అందిస్తుంటారు కాబట్టి ముఖ్యమంత్రి సహాయనిధి కి విరాళం ఇవ్వడానికి రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ .

తనకు వచ్చిన ఫిల్మ్ ఫేర్ అవార్డు ని వేలం వేసి , ఆ సొమ్ము ని ముఖ్యమంత్రి సహాయనిధి కి ఇవ్వనున్నాడు . తనకు వచ్చిన అవార్డు ఆపదలో ఉన్నవాళ్లకు ఉపయోగపడితే సంతోషిస్తానని , నా ఇంటిలో ఉంటే అంతగా సంతోషాన్ని ఇవ్వదని అంటున్నాడు విజయ్ దేవరకొండ . అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ . ప్రస్తుతం ఈ హీరో నటించిన టాక్సీ వాలా చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది .