విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్


ismrat shankar
ismrat shankar

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్ . దర్శకులు పూరి జగన్నాధ్ మొదట ఇస్మార్ట్ శంకర్ అనే కథని విజయ్ దేవరకొండ కే వినిపించాడు . విజయ్ దేవరకొండ తెలంగాణ హీరో కావడంతో అతడి స్లాంగ్ కి తగ్గట్లుగా ఈ కథ రెడీ చేసాడు . అయితే కథ విన్నాకా విజయ్ దేవరకొండ ఈ సినిమా చేయలేనని నిర్మొహమాటంగా చెప్పాడట ! దాంతో షాక్ అయిన పూరి రామ్ దగ్గరకు వెళ్ళాడు .

ఇక రామ్ ఈ కథ విన్నాక వెంటనే ఒప్పేసుకున్నాడట . అయితే విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన ఇస్మార్ట్ శంకర్ జూలై 18 న విడుదల అవుతోంది . అది హిట్ అయితే విజయ్ పెద్ద తప్పు చేసినట్లే ! ఒకవేళ ప్లాప్ అయితే లక్కీ ఫెల్లో అనే చెప్పాలి . రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది తేలాలంటే ఈనెల 18 వరకు ఎదురు చూడాల్సిందే . ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ జూలై 26 న విడుదల కానుంది .