విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందా ?


vijay devarakonda
vijay devarakonda

విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్న హీరో చిత్రం ఆగిపోయినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి . తెలుగు , తమిళ భాషల్లో హీరో అనే చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసారు మైత్రి మూవీ మేకర్స్ . సినిమా కూడా ప్రారంభోత్సవం జరుపుకుంది కూడా . కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో స్క్రిప్ట్ వర్క్ లేదని ఆపేసినట్లుగా పుకార్లు వస్తున్నాయి .

అయితే ఆ పుకార్లు ఎక్కువ కావడంతో విజయ్ దేవరకొండ స్పందించి ఆ సినిమా ఆగిపోలేదని , క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పూర్తయ్యాక హీరో చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని ప్రకటించాడు . ఆ పుకార్లని తగ్గించడానికి ఈ ప్రకటన విడుదల చేసారు . డియర్ కామ్రేడ్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ .