విజయ్ దేవరకొండ దొరసాని చూడటానికి భయపడ్డాడట

Vijay devarakonda scared to see Anand devarakonda film
Vijay devarakonda scared to see Anand devarakonda film

దొరసాని సినిమా చూడటానికి భయపడ్డాడట హీరో విజయ్ దేవరకొండ , కానీ ధైర్యం చేసి సినిమా చూశాడని విజయ్ కి నచ్చడంతో సంతోషంగా ఓ హగ్ ఇచ్చాడని అంటున్నాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ . ఈనెల 12 న దొరసాని చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చాడు ఆనంద్ దేవరకొండ .

దొరసాని సినిమాని మొత్తానికి అన్నయ్య విజయ్ దేవరకొండ చూశాడని , అతడికి బాగా నచ్చిందని దాంతో తప్పకుండా పెద్ద హిట్ కొట్టబోతున్నామనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఆనంద్ .అంతేనా అన్నయ్య సపోర్ట్ నాకు ఉంది కానీ అదొక్కటే సరిపోదు లక్ ఉంటేనే , ప్రతిభ ఉంటేనే విజయం సాధిస్తావు అని విజయ్ చెప్పిన మాటలు నాకు స్ఫూర్తి నిచ్చాయి ,అన్నయ్య ఇచ్చిన ధైర్యం మాటల్లో చెప్పలేను అని అంటున్నాడు ఆనంద్ దేవరకొండ  .

అయితే ఈ హీరో అమెరికా వెళ్లకముందే యాక్టింగ్ అంటే ఆసక్తి ఉండటంతో థియేటర్ ఆర్టిస్ట్ గా రాణించాడు . అమెరికాలో జాబ్ చేస్తూ అన్నయ్య సక్సెస్ అయ్యాక తిరిగి ఇండియాకు వచ్చి మహేంద్ర చెప్పిన కథ బాగా నచ్చడంతో దొరసాని చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు . ఆనంద్ దేవరకొండ పై కొంతమంది అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు కానీ సినిమా రిలీజ్ అయ్యాక కానీ అసలు విషయం తెలీదు .