ఆ సినిమా చూసేది లేదంటున్న విజయ్ దేవరకొండ

Vijay Deverakonda
Vijay Deverakonda

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కబీర్ సింగ్ చిత్రం చూసేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు . ఆల్రెడీ నేను చేసిన సినిమా మరో భాషలో తీశారు ఇక దాన్ని చూసేదేముంది అంటూ కబీర్ సింగ్ ని లైట్ గా తీసుకున్నాడు . అంతేనా ఇకపై ఆ సినిమా గురించి నో మోర్ డిస్కషన్స్ అంటూ ముగించాడు విజయ్ దేవరకొండ . తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే .

అయితే ఆ సినిమాని ఓ మూడు గంటలు కూర్చొని చూస్తే సరిపోయేది కానీ నేను ఆ సినిమాని చూడను , దాని గురించి డిస్కషన్స్ వద్దు అని చెప్పడం మాత్రం బాగోలేదు . ప్రస్తుతం ఈ హీరో నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు . ఆ సందర్బంగా కబీర్ సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు .