లిప్ లాక్ లపై నోరు విప్పిన విజయ్ దేవరకొండ


Vijay Devarakonda And Rashmika Manadanna
Vijay Devarakonda And Rashmika Manadanna

డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ల మధ్య లిప్ లాక్ లు ఉండటంతో ఎక్కువగా చర్చ అంతా లిప్ లాక్ ల మీదే నడుస్తోంది . అయితే సినిమా విషయాన్ని పక్కన పెట్టి ఎక్కువగా లిప్ లాక్ ల మీద ప్రశ్నలు వేస్తుండటంతో తీవ్ర అసహనానికి గురైన విజయ్ దేవరకొండ మొత్తానికి ఆ లిప్ లాక్ లపై నోరు విప్పాడు .

లిప్ లాక్ సీన్లలో నటించే నటీనటులకు ఆ సినిమాపై ఎన్నో ఆశలు ఉంటాయి , అయితే సినిమాలో మిగతా భాగం అంతా వదిలేసి కేవలం లిప్ లాక్ ల గురించే అడగడం అంటే మాకు ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసా ……. అయినా ఎంతో కస్టపడి సినిమా చేస్తాం …… దాని మీద దర్శక నిర్మాతలు , నటీనటుల భవిష్యత్ ఆధారాపడి ఉంటుంది . అలాగే ఆ సినిమా హిట్ అయితేనే ఒత్తిడి నుండి బయట పడతాం రిలాక్స్ అవుతాం అంటూ లిప్ లాకు చూసేవాళ్లకు బాగానే ఉంటుంది కానీ చేసే వాళ్ళకే నరకం అంటూ అసలు విషయాన్నీ చెప్పాడు విజయ్ దేవరకొండ . డియర్ కామ్రేడ్ ఈనెల 26 న విడుదల అవుతున్న నేపథ్యంలో చెన్నై లో మీడియా ముందుకు వచ్చాడు ఈ హీరో .