నా సినిమాని చంపేశారంటున్న విజయ్ దేవరకొండ


Vijay devarakonda
Vijay devarakonda

నా సినిమాలపై కొంతమంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని డియర్ కామ్రేడ్ చిత్రాన్ని కావాలనే చంపేశారని సంచలన వ్యాఖ్యలు చేసాడు హీరో విజయ్ దేవరకొండ . అయితే ఎవరు ఎంతగా ప్రయత్నించినా వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు అని అంటున్నాడు ఈ హీరో . నాపై , నా సినిమాలపై అదేపనిగా దుష్ప్రచారం చేసున్నారని కానీ ఇలా చేయడం వల్ల నన్ను దెబ్బకొట్టలేరని ధీమా వ్యక్తం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ .

ఈ హీరో కు సడెన్ గా స్టార్ డం వచ్చింది దాంతో నిజంగానే విజయ్ దేవరకొండపై తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నారు . ఇక డియర్ కామ్రేడ్ విషయానికి వస్తే …….. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు దాంతో మరింతగా రెచ్చిపోయి దాన్ని మరింతగా స్ప్రెడ్ చేసారు . ఆ నోటా ఈనోటా విజయ్ దేవరకొండ చెవిన పడటంతో బాధపడిన ఈ హీరో తనపై కుట్ర జరుగుతోందన్న విషయాన్ని వెల్లడించాడు .