డియర్ కామ్రేడ్ కు చెక్ పెట్టిన రాక్షసుడు


Vijay devarakonda shocked with Bellamkonda Sai Srinivas
Vijay devarakonda shocked with Bellamkonda Sai Srinivas

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రానికి ఏ సెంటర్ లలో మంచి వసూళ్లే వస్తున్నాయి అయితే బిసి లలో అంతగా ప్రభావం చూపించడం లేదు దాంతో డియర్ కామ్రేడ్ సేఫ్ అవుతాడని అనుకున్నారు కానీ నిన్న విడుదలైన రాక్షసుడు డియర్ కామ్రేడ్ కు చెక్ పెట్టాడు . సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన రాక్షసుడు చిత్రానికి యునానిమస్ గా హిట్ టాక్ వచ్చింది పైగా ఏ క్లాస్ సినిమా కావడంతో డియర్ కామ్రేడ్ కు చెక్ పెట్టినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు . ప్రస్తుతం సమాజంలో సాగుతున్న అరాచకాల నేపథ్యంలో సాగే కథ కావడంతో ఓన్ చేసుకుంటున్నారు . ఇక చాలాకాలం తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మంచి హిట్ లభించింది రాక్షసుడు చిత్రం రూపంలో . ఇక డియర్ కామ్రేడ్ విషయానికి వస్తే బయ్యర్లు సేఫ్ కావాలంటే మరో 7 కోట్లు వసూల్ కావాలి పరిస్థితి చూస్తుంటే అది కష్టమే అనిపిస్తోంది .