విజయ్ దేవరకొండని రిజెక్ట్ చేసిన భామ


Vijay devarakonda shocked with jhanvi kapoor

పెళ్ళి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్న క్రేజీ హీరో విజయ్ దేవరకొండ . ఈ హీరో సరసన నటించే చాన్స్ కోసం బోలెడు మంది హీరోయిన్ లు ఆశగా ఎదురు చూస్తున్నారు . అయితే ఒక్క హీరోయిన్ మాత్రం విజయ్ దేవరకొండ అంటే అస్సలు పడటం లేదు . అంతేకాదు విజయ్ దేవరకొండ తో సినిమా చేసేది లేదని చెప్పేసిందట . నిజంగా షాకింగ్ న్యూస్ కదూ ! అవును నిజమే విజయ్ దేవరకొండని రిజెక్ట్ చేసింది ఓ బాలీవుడ్ హీరోయిన్ . ఇంతకీ విజయ్ కి నో చెప్పిన హీరోయిన్ ఎవరో తెలుసా ……… జాహ్నవి కపూర్ .

సైరత్ రీమేక్ దడక్ లో నటించిన జాహ్నవి . అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ విజయ్ ని ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా …. అర్జున్ రెడ్డి వల్ల . అర్జున్ రెడ్డి చిత్రంలో ఘాటు లిప్ లాక్ లు ఉన్న విషయం తెలిసిందే . బోల్డ్ చిత్రంగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం గురించి విన్నదట జాహ్నవి , కరణ్ జోహార్ ఆ హీరోతో సినిమా వద్దు అని చెప్పాడట ! ఇంకేముంది నో చెప్పేసింది . విజయ్ దేవరకొండ తో బాలీవుడ్ లో ఓ సినిమా చేయాలనీ భావించారు . కానీ ఇలా బెడిసి కొట్టింది .

English Title: Vijay devarakonda shocked with jhanvi kapoor