విజయ్ దేవరకొండకు షాక్ : టాక్సీ వాలా కూడా లీక్


vijay devarakonda shocked with leakageఅయితే అప్పుడే టాక్సీ వాలా కూడా లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి కానీ పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి సమస్య పరిష్కారం అయినట్లే అని అనుకున్నారు కట్ చేస్తే టాక్సీ వాలా పూర్తి హెచ్ డి క్వాలిటీ తో లీక్ అయినట్లు తెలుస్తోంది దాంతో ఆ సినిమా తరుపున నిర్మాత శానం నాగ అశోక్ కుమార్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

శానం నాగ అశోక్ కుమార్ ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరి ద్వారా ఎక్కడెక్కడ లీక్ చేశారో కూపీ లాగుతున్నారు పోలీసులు. అసలే టాక్సీ వాలా సినిమా విషయంలో అల్లు అరవింద్ తో పాటు హీరో విజయ్ దేవరకొండ కూడా అసంతృప్తి తో ఉన్నారు అందుకే ఆ సినిమాని మూడు నెలలుగా వాయిదా వేస్తూనే ఉన్నారు. కొంత రీ షూట్ చేసి గ్రాఫిక్స్ బాగా వచ్చేలా చేయాలని భావిస్తున్నారు అలాంటి సమయంలో ఇలా సినిమా లీక్ కావడం ఆందోళన కలిగించే అంశమే ! గీత గోవిందం సక్సెస్ తో సంతోషంగా ఉన్న విజయ్ దేవరకొండ మరోసారి ఏడుస్తాడేమో టాక్సీ వాలా లీక్ అయ్యిందని.

English Title: vijay devarakonda shocked with leakage