మరోసారి ద్విభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ

Vijay devarakonda signs bilingual movie
Vijay Devarakonda

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ మరో సారి ద్విభాషా చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు . ఇప్పటికే నోటా చిత్రంతో ద్విభాషా చిత్రం చేసాడు విజయ్ దేవరకొండ . అయితే రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన నోటా అట్టర్ ప్లాప్ అయ్యింది కానీ విజయ్ మాత్రం మళ్ళీ ద్విభాషా చిత్రం చేయడానికి వెనుకాడటం లేదు . తాజాగా ఈ హీరో డియర్ కామ్రేడ్ చిత్రంలో చేస్తున్నాడు . ఆ సినిమా కాకినాడలో షూటింగ్ జరుపుకుంటోంది , హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా మరోసారి తెలుగు , తమిళ బాషలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ .

ఎస్ ఆర్ ప్రభు నిర్మించనున్న ఈ ద్విభాషా చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు . త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది . ఇప్పటికే గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రంతో సంచలన విజయాలు అందుకున్న విజయ్ దేవరకొండ రష్మిక మందన్న తో మరోసారి డియర్ కామ్రేడ్ లో రొమాన్స్ చేస్తున్నాడు .

 

English Title: Vijay devarakonda signs bilingual movie