లిప్ లాక్ పెడితేనే హిట్ అవుతాయా : విజయ్ దేవరకొండ 


vijay deverakonda
vijay deverakonda and rashmika mandanna

సినిమా హిట్ కావాలంటే లిప్ లాకులు పెట్టాల్సిందేనా ? అంటూ ప్రశ్నిస్తున్నాడు విజయ్ దేవరకొండ . తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ఈ హీరో డియర్ కామ్రేడ్ చిత్ర విశేషాలను వెల్లడించాడు . ఇక లిప్ లాక్ ల గురించి మాట్లాడుతూ మరో రెండు మూడేళ్ళ లో లిప్ లాక్ సీన్స్ సినిమాలో చాలా కామన్ అయిపోతాయి . కానీ లిప్ లాక్ లుంటేనే హిట్ అవుతుందని అనడం కరెక్ట్ కాదని అంటున్నాడు విజయ్ దేవరకొండ .

రష్మిక మందన్న కాకుండా అక్కడ మరో హీరోయిన్ ఉన్నా రొమాన్స్ పండించేవాడిని , ఓ యాక్షన్ సీన్ ఎలాగో రొమాంటిక్ సీన్ కూడా అలాగే అంతేకాని దానికి ఎలాంటి ప్రత్యేకత లేదని అంటున్నాడు ఈ హీరో . రష్మిక మందన్న తో చాలా క్లోజ్ గా ఉంటుండటంతో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి దాంతో ఇలా వివరణ ఇచ్చాడు విజయ్ దేవరకొండ .