టాక్సీ వాలా క్లోజింగ్ కలెక్షన్స్

Vijay Devarakonda Taxiwaala closing Collections
Taxiwala

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం మొత్తానికి తన ఖాతాని క్లోజ్ చేసింది బాక్సాఫీస్ వద్ద . నవంబర్ 17 న విడుదలైన ఈ టాక్సీ వాలా చిత్రానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు . ప్రపంచ వ్యాప్తంగా టాక్సీ వాలా చిత్రం 21. 28కోట్ల వసూళ్ల ని సాధించింది . టాక్సీ వాలా చిత్రం విడుదలకు ముందే మొత్తం సినిమా లీక్ అయ్యింది దాంతో ఈ సినిమా విజయం సాధించడం కష్టమే అనుకున్నారు కట్ చేస్తే కేవలం  5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన టాక్సీ వాలా 21. 28కోట్ల షేర్ వసూల్ చేసి ప్రభంజనం సృష్టించింది .

విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జవాల్కర్ నటించగా మాళవిక నాయర్ కీలక పాత్రలో నటించింది . రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో 15 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ ని తెలియజేసింది . వరుస విజయాలు సాధిస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు . అయితే ఆ సినిమా 2019 వేసవి తర్వాతే రానుంది .

English Title: Vijay Devarakonda Taxiwaala closing Collections