విజయ్ దేవరకొండ సినిమా మళ్ళీ వాయిదా


vijay devarakonda taxiwala postponed againఅర్జున్ రెడ్డి తో సంచలనం సృష్టించి ఇండస్ట్రీ దృష్టి ని తనవైపు కు తిప్పకున్న హీరో విజయ్ దేవరకొండ , తాజాగా మహానటి తో మరో అద్భుత విజయాన్ని అందుకున్నాడు కాగా ఆ సినిమా తో పాటుగా ”టాక్సీవాలా ” చిత్రం విడుదల కావాల్సి ఉండే కానీ అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది . మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో అన్నారు కట్ చేస్తే ఇప్పుడు జూన్ మొదటి వారంలో విడుదల కావడం లేదని తెలుస్తోంది .

టాక్సీవాలా చిత్రం మరోసారి వాయిదా పడటానికి కారణం ఏంటో తెలుసా …….. కొన్ని గ్రాఫిక్ సీన్స్ సరిగ్గా రాలేదట ! దాంతో క్వాలిటీ కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఆ చిత్ర బృందం . హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పై విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకున్నాడు . తన ఇమేజ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తుందని నమ్ముతున్నాడు అందుకే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కానీ సినిమా ఆలస్యం అయ్యే కొద్దీ ప్రేక్షకుల్లో అంచనాలు మిస్ అవుతాయేమో అన్న భయం కూడా ఉందట . అయితే ఈ నెల ఆఖరున తప్పకుండా విడుదల చేయాలనీ పట్టుదలగా ఉన్నారట ఆ చిత్ర బృందం .