ముగ్గురు దర్శకులకు థాంక్స్ చెప్పిన విజయ్ దేవరకొండ


Vijay devarakonda thanks to nag ashwin , tarun bhaskcer and sandeep reddy vanga పూర్వకంగా ట్వీట్ పెట్టాడు హీరో విజయ్ దేవరకొండ . ఇంతకీ ఆ ముగ్గురు దర్శకులు ఎవరయ్యా అంటే నాగ్ అశ్విన్ , దాస్యం తరుణ్ భాస్కర్ , సందీప్ రెడ్డి వంగా . ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో నాగ్ అశ్విన్ ఛాన్స్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ కు , ఆ పాత్ర ద్వారా కొంత వరకు పేరొచ్చింది విజయ్ దేవరకొండ కు ఆ తర్వాత పెళ్లి చూపులు చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టి ని ఆకర్షించాడు , ఇక ఆ సినిమాకు దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ అన్న విషయం తెలిసిందే .

పెళ్లి చూపులు సంచలన విజయం సాధించిన తర్వాత విడుదలైన చిత్రం అర్జున్ రెడ్డి . ఒక్కసారిగా అర్జున్ రెడ్డి తో స్టార్ డం అందుకున్నాడు విజయ్ దేవరకొండ . ఇక ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది సందీప్ రెడ్డి వంగా . ఎవడే సుబ్రహ్మణ్యం , పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలు విజయ్ దేవరకొండ కెరీర్ లో మరిచిపోని చిత్రాలు అలాగే నాగ్ అశ్విన్ , దాస్యం తరుణ్ భాస్కర్ , సందీప్ రెడ్డి వంగా లు కూడా విజయ్ దేవరకొండ జీవితంలో చెరిగిపోని ముద్ర వేశారు దాంతో నా ఈ విజయానికి , నా ఈ స్థానానికి మీరే కారకులు అంటూ ట్విట్టర్ లో కూత పెట్టాడు ఈ హీరో . తాజాగా గీత గోవిందం చిత్రంతో విజయాన్ని అందుకున్న సందర్బంగా ఈ ట్వీట్ పెట్టి ఆసక్తి పెంచాడు విజయ్ దేవరకొండ .

English Title: vijay devarakonda thanks to nag ashwin , tarun bhaskcer and sandeep reddy vanga