మహేష్ ఫ్యాన్స్ ను బుట్టలో వేసుకుంటున్న రౌడీమహేష్ ఫ్యాన్స్ ను బుట్టలో వేసుకుంటున్న రౌడీ
మహేష్ ఫ్యాన్స్ ను బుట్టలో వేసుకుంటున్న రౌడీ

యంగ్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ హిట్లు, ప్లాపులతో సమానంగా వెళ్తోంది. ఒక హిట్ వచ్చిందంటే వెంటనే మరొక ప్లాప్ వచ్చి పైకి వెళ్లిన కెరీర్ గ్రాఫ్ ను కిందకి దించుతోంది. పైగా క్లాస్ సినిమాలతోనే హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ కొంచెం మాస్ కథతో ప్రయత్నించినా ప్లాప్స్ అందుకున్నాడు. తనకి సరైన ఫ్యాన్ బేస్ లేని కారణంగానే ఇలా జరుగుతోంది అని నమ్ముతున్న విజయ్ దేవరకొండ ఇప్పటికిప్పుడు తనకి ఫ్యాన్ బేస్ రాదు కాబట్టి స్టార్ హీరో అభిమానులను ఇంప్రెస్ చేసే పనిలో పడ్డాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే తనకు పెర్ఫెక్ట్ అని భావించాడు. మొన్న మహర్షి ఆడియో లాంచ్ కు వెళ్లి మహేష్ తన ఫేవరెట్ యాక్టర్ అని చెప్పిన విజయ్ దేవరకొండ నిర్మాతగా తన తొలి చిత్రం మీకు మాత్రమే చెప్తా ట్రైలర్ లాంచ్ కు మహేష్ నే పిలిచాడు. అక్కడ కూడా మహేష్ ను పొగడ్తలతో ముంచెత్తాడు.

ఈ రకంగా తన సినిమాలకు మహేష్ ఫ్యాన్స్ కొమ్ము కాస్తారని విజయ్ దేవరకొండ నమ్ముతున్నాడు. మరో యంగ్ హీరో నితిన్ విషయంలో ఇదే జరిగింది. పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా నితిన్ చెప్పుకుంటూ ఉంటాడు. సో, నితిన్ ను తమవాడిగా భావిస్తారు పవన్ కళ్యాణ్ అభిమానులు. మరి నితిన్ విషయంలో జరిగిందే, విజయ్ దేవరకొండ విషయంలో కూడా జరుగుతుందా అన్నది చూడాలి.