విజయ్ దేవరకొండ ఎవరి మీద సెటైర్ వేస్తాడో !

Vijay devarakonda turns chief guest for Dorasani
Vijay devarakonda turns chief guest for Dorasani

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరో అయిన విషయం తెలిసిందే . మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన దొరసాని చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమా ఈనెల 12 న విడుదల అవుతున్న నేపథ్యంలో ఈరోజు దొరసాని ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు . కాగా ఆ ఈవెంట్ కు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అథితిగా హాజరౌతున్నాడు.

తమ్ముడి సినిమా విడుదల అవుతుంటే ఈ హీరో పెద్దగా పట్టించుకోవడమే లేదు అంటూ వస్తున్న విమర్శలకు చెక్ పెట్టనున్నాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మళ్ళీ ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేయడం ఖాయంగా కనబడుతోంది . విజయ్ దేవరకొండ తన ప్రతీ సినిమా ఈవెంట్ లో ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నాడు. ఈరోజు ఎవరి మీద సెటైర్ వేస్తాడో చూడాలి సాయంత్రం.