నా సినిమా వస్తోంది ఖబర్దార్ : విజయ్ దేవరకొండ


డియర్ కామ్రేడ్ చిత్రం వస్తోంది ఖబర్దార్ అని మిగతా హీరోలకు వార్నింగ్ ఇస్తున్నాడు విజయ్ దేవరకొండ . ఎంతైనా ఈ హీరో రౌడీ కి బ్రాండ్ అంబాసిడర్ కదా ! అందుకే నా సినిమా మరో 50 రోజుల్లో వస్తోంది అంటూ నిన్న ట్వీట్ చేసాడు . రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్ . తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ బాషలలో ఈ చిత్రం జూలై 26 న విడుదల కానుంది .

భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మేలోనే విడుదల కావాల్సి ఉండే కానీ కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బెటర్ మెంట్ కోసం రీ షూట్ చేసారు . దాంతో ఆలస్యం అయ్యింది . అయితే డియర్ కామ్రేడ్ విడుదల కావడానికి ఇంకా చాలా సమయమే ఉంది కానీ తన సినిమాని ప్రేక్షకులు మర్చిపోవద్దని ఇలా ప్రచారం షురూ చేసిండు ఎందుకంటే రౌడీ కదా ! జూలై 26 న విడుదల కానున్న ఈ చిత్రంతో దక్షిణాది లోని అన్ని బాషలలో తన మార్కెట్ ని పెంచుకోవాలనే ఆలోచన చేస్తున్నాడు . చూద్దాం సక్సెస్ అవుతాడా ?