విజయ్ దేవరకొండ ట్వీట్ వివాదం కానుందా ?


టాలీవుడ్ నయా సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న విజయ్ దేవరకొండ ట్వీట్ లు ఎప్పుడూ అగ్రెస్సివ్ గా ఉంటాయన్న విషయం తెలిసిందే . దూకుడు మనస్తత్వం ఉన్న విజయ్ ఇలా ట్వీట్ చేయడం అలా వైరల్ అవ్వడం కామన్ అయిపొయింది . తాజాగా హీరో చేసిన ట్వీట్ వివాదం సృష్టించేలా ఉంది . ఎందుకంటే మిగతా స్టార్ హీరోల అభిమానులకు విజయ్ ట్వీట్ మింగుడు పడటం కష్టమే

ఇంతకీ విజయ్ చేసిన ట్వీట్ ఏంటో తెలుసా ……… డియర్ కామ్రేడ్ చిత్రం నుండి రేపు రెండో సాంగ్ రిలీజ్ అవుతోంది అది ఏడాది బెస్ట్ సాంగ్ అంటూ ట్వీట్ చేసాడు . ఇప్పటికే విడుదలైన ఒక పాట హిట్ కాగా రేపు విడుదల అయ్యే పాట పెద్ద హిట్ అవుతుందని ముందే చెప్పడం వేరు కానీ ఏడాది బెస్ట్ సాంగ్ అని చెప్పడం మాత్రం మిగతా హీరోల అభిమానులను కెలికినట్లే ! మొత్తానికి హీరోల ట్వీట్ లు ఎలా ఉన్నప్పటికీ టాలీవుడ్ లో విజయాలతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు