పవన్ కళ్యాణ్ కు విషెస్ చెప్పిన విజయ్ దేవరకొండ


Vijay devarakonda tweets on Pawankalyan

ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో కాస్త ఆలస్యంగానైనా పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ. టాలీవుడ్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ మరే హీరోకు లేదంటే అతిశయోక్తి కాదేమో!తాజాగా ఈ హీరో గీత గోవిందం చిత్రంతో వంద కోట్ల భారీ వసూళ్లు సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణ చిత్రంగా వచ్చిన గీత గోవిందం భారీ విజయాన్ని సాధించింది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఈ హీరో కు కూడా ఎనలేని క్రేజ్ వచ్చింది. హిట్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యం కాగా పవన్ తర్వాత ఆ స్థాయిని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. అందుకే పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఇక ఆ విషయాన్ని పక్కనపెడితే రేపటి నుండి ప్రచారం చేయబోతున్నాను అంటూ ట్వీట్ చేసాడు దాంతో ప్రచారం అంటే సినిమా కోసం ప్రచారం చేయబోతున్నాడా ? లేక రాబోయే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరుపున ప్రచారం చేయనున్నాడా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడు విజయ్ దేవరకొండ దాంతో ఆ పార్టీ తరుపున ప్రచారం చేస్తాడని తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో ప్రచారం చేస్తాడా ? లేక మంచి సినిమాల కోసం ప్రచారం చేస్తాడా ? అన్నది రెండు మూడు రోజుల్లోనే తేలిపోనుంది.

English Title: vijay devarakonda tweets on pawankalyan