సమంత హిట్ కోసం విజయ్ దేవరకొండ


Vijay devarakonda waiting for samantha's majili

సమంత నటించిన మజిలీ హిట్ కావాలని ఎదురు చూస్తున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ . సమంత సినిమా హిట్ కోసం విజయ్ దేవరకొండ ఎదురు చూడటం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఎందుకంటే మజిలీ దర్శకుడు శివ నిర్వాణ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ తో చేయాలనీ ఆశిస్తున్నాడు . అంతేగాదు ఓ కథ కూడా చెప్పాడట విజయ్ దేవరకొండకు . కథ నచ్చింది కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు ఎందుకంటే మజిలీ రిలీజ్ అయ్యాక ఆ రిజల్ట్ చూసి ఇస్తాడేమో !

 

మజిలీ చిత్రంలో నాగచైతన్య – సమంత జంటగా నటించగా ఏప్రిల్ 5న ఆ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగుతున్నందున రిలీజ్ మారుతుందా చూడాలి . ఇక మజిలీ రిజల్ట్ వచ్చాకే విజయ్ దేవరకొండ ఓ నిర్ణయం తీసుకోనున్నాడట . మహానటి చిత్రంలో విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన విషయం విదితమే !

English Title: Vijay devarakonda waiting for samantha’s majili