విజయ్ దేవరకొండ హగ్ చేసుకుందామనుకున్నాడట


Vijay devarakonda wants keeravani's hug

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణిని హగ్ చేసుకోవాలని ఎన్నో సార్లు అనుకున్నాడట కానీ ఎప్పటికప్పుడు ఆ కోరిక ని వాయిదా వేస్తూనే ఉన్నాడట . ఈ విషయాన్నీ నిన్న సవ్యసాచి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పి సంచలనం సృష్టించాడు . కీరవాణి సంగీతానికి నేను పెద్ద అభిమానిని దాంతో ఆయనంటే ఇష్టం కాబట్టి ఒక్కసారైనా కౌగిలించుకోవాలని ఆశపడ్డాడట విజయ్ దేవరకొండ . ఒకసారి ముంబాయి లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతే కీరవాణి గారే ఇచ్చారు అంటూ కృతఙ్ఞతలు తెలిపిన విజయ్ తనని హగ్ చేసుకోవాలనే కోరిక మాత్రం అలానే ఉండిపోయిందని సెలవిచ్చాడు .

అలాగే నాగచైతన్య అంటే కూడా నాకు చాలా ఇష్టమని , తను ఓ హీరోలా ఎప్పుడూ ఫీల్ అవడని సవ్యసాచి తనకు పెద్ద హిట్ అవ్వాలని చెప్పి అక్కినేని అభిమానులను సంతోష పెట్టాడు విజయ్ దేవరకొండ . గీత గోవిందం చిత్రంతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ నోటా తో షాక్ తిన్నాడు . ఇక ఇప్పుడేమో టాక్సీ వాలా చిత్రంతో నవంబర్ 16 న వస్తున్నాడు . మరి ఈ టాక్సీ వాలా చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో . నాగచైతన్య సవ్యసాచి నవంబర్ 2 న విడుదల అవుతోంది .

English Title : Vijay devarakonda wants keeravani’s hug