విజయ్ దేవరకొండ ని అక్కడ దింపేది ఎవరు


vijay devarakonda wants lift for CM office

తనని ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర డ్రాప్ చేసేవాళ్ళు కావాలని అంటున్నాడు అర్జున్ రెడ్డి చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ . ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర దించితే తనకు వచ్చిన ఫిల్మ్ ఫేర్ అవార్డు ని ముఖ్యమంత్రి సహాయనిధి కి అందిస్తానని అంటున్నాడు ఈ హీరో . అర్జున్ రెడ్డి చిత్రంలోని నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది దాంతో ఆ అవార్డు ని వేలం వేసి ఆ సొమ్ము ని ముఖ్యమంత్రి సహాయనిధి కి ఇవ్వాలని అనుకున్నాడు . ఈ విషయం తెలుసుకున్న ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విజయ్ ని అప్రిషియేట్ చేయడంతో నన్ను ముఖ్యమంత్రి ఇంటి దగ్గర లేదా ఆఫీసులోనైనా దింపండి ఈ అవార్డు ఇచ్చేస్తాను అంటూ రీ ట్వీట్ చేసాడు విజయ్ దేవరకొండ .

అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ అమాంతం పెరిగింది , ఇక మహానటి చిత్రంలో కూడా విజయ్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది . ప్రస్తుతం టాక్సీ వాలా విడుదల కావాల్సి ఉంది . హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన టాక్సీ వాలా పై చాలా ఆశలే పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ .