మహర్షి హిట్ కోసం విజయ్ దేవరకొండ


టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ మహర్షి సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాడు . అయితే ఈ క్రేజీ హీరో ఇలా కోరుకోవడానికి కారణం ఏంటో తెలుసా ……. రేపు మహర్షి చిత్రం రిలీజ్ కానీ అంతకంటే ఎక్కువగా ఈ హీరో పుట్టినరోజు మరి . అవును రేపు విజయ్ దేవరకొండ పుట్టినరోజు దాంతో నా పుట్టినరోజున విడుదల అవుతున్న మహర్షి తప్పకుండా హిట్ కావాలి లేదంటే నాకు చెడ్డ పేరు అని భావిస్తున్నాడు .

అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పాడు కదా ! ఈ రెండు విషయాల గురించి . ఇక ఈరోజంతా విజయ్ దేవరకొండ హడావుడి మాములుగా ఉండదు . జన్మదిన శుభాకాంక్షలు చెప్పే వాళ్లతో , పార్టీలతో పబ్ లలో సందడే సందడి . మహర్షి చిత్రం రేపు విడుదల అవుతుండగా ఇక ఈ హీరో నటించిన డియర్ కామ్రేడ్ మాత్రం జూన్ లేదా జులై లో విడుదల కానుంది .