విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివ నిర్వాణ ఫిల్మ్ వుందా?

Vijay devarakonda with shiva nirvanas film is  there
Vijay devarakonda with shiva nirvanas film is  there

క‌రోనా మ‌హ‌మ్మారి సినీ ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోల ప్లాన్‌ని తారుమారు చేసింది. కొన్ని అనుకున్న‌వి వాయిదా ప‌డ‌గా, అంగీక‌రించిన‌వి ముందుకు వెళ‌తాయా?  లేక మొద‌లవ్వ‌కుండానే ఆగిపోతాయా? అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. `ఐకాన్‌` స్టార్ట్ కాకుండానే ఆగిపోయిన విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో మ‌రో సినిమా కూడా ఆగిపోనుందా? అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అదే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివ నిర్వాణ ఫిల్మ్‌. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో దిల్ రాజు ఈ మూవీని చేయ‌బోతున్న‌ట్టు గ‌త కొన్ని నెల‌ల క్రితం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఈ మూవీ ఇంత వ‌ర‌కు ఒక్క స్టెప్ కూడా ముందుకు క‌ద‌ల‌లేదు. దీంతో ఈ మూవీ ఆగిపోయిన‌ట్టేనా అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ 12వ చిత్రంగ ఈ మూవీని దిల్ రాజు 2019 డిసెంబ‌ర్ 18న ప్ర‌క‌టించారు.

కానీ ఇప్ప‌టికీ ముందుకు క‌ద‌ల‌లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ను న‌టిస్తున్న `లైగ‌ర్‌` త‌రువాత సుకుమార్‌తో సినిమా చేస్తార‌ట‌. ఇదివ‌ర‌కే ఈ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఫాల్క‌న్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది. దీనికి సుకుమార్ ఎక్కువ స‌మ‌యం కావాలంటే విజ‌య్ అప్పుడు శివ నిర్వాణ చిత్రాన్ని ముందు చేస్తార‌ట‌. లేదంటే సుకుమార్ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కు శివ నిర్వాణ ఎదురుచూడాల్సిందేన‌ని చెబుతున్నారు.