డియర్ కామ్రేడ్ సెన్సార్ టాక్ ఎలా ఉందంటే


 Vijay devarakonda's Dear comrade censor Talk 
Vijay devarakonda’s Dear comrade censor Talk

డియర్ కామ్రేడ్ సెన్సార్ టాక్ ఎలా ఉందంటే

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే . ఈ చిత్రానికి యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు . ఇక సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో టాక్ బయటకు వచ్చింది . ఇంతకీ డియర్ కామ్రేడ్ సెన్సార్ టాక్ ఎలా ఉందో తెలుసా ……… …యావరేజ్ లేదా  జస్ట్ హిట్ అని మాత్రమే అంటున్నారు .

ఫస్టాఫ్ అందరికీ నచ్చేలా ఉందట , అయితే సెకండాఫ్ మాత్రం స్లో నెరేషణ్ వల్ల పైగా ఎక్కువ రన్ టైం ఉండటం కూడా ప్రేక్షకులను అసహనానికి గురిచేసేలా ఉందని అంటున్నారు . ఎక్కువ నిడివి కాస్త ఇబ్బంది పెట్టొచ్చు అని అంటున్నారు . అయితే కొంతమంది అభిప్రాయం మాత్రమే సుమా ! విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం . ఇక ఈ సినిమా యూత్ కి నచ్చితే బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా ఖాయమే ! అయితే అది ప్రేక్షకుల తీర్పు మీద ఆధారపడి ఉంది .

విజయ్ దేవరకొండ , డియర్ కామ్రేడ్ , ఫిలిం న్యూస్ , రష్మిక మందన్న