డియర్ కామ్రేడ్ ఫస్ట్ రివ్యూ


Dear Comrade First Review Out
Dear Comrade First Review Out

డియర్ కామ్రేడ్ ఈనెల 26 న విడుదల అవుతుండగా అప్పుడే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది . ఇక ఈ ఫస్ట్ రివ్యూ ఇచ్చింది బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ . డియర్ కామ్రేడ్ చిత్రాన్ని చూసాను అద్భుతంగా ఉంది , విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని , ఇంటెన్స్ ఉన్న లవ్ స్టోరీ …… చక్కని సందేశం ఉన్న సినిమా అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు కరణ్ జోహార్ . అలాగే దర్శకుడు భరత్ కమ్మ పై కూడా ప్రశంసలు కురిపించాడు .

యూత్ కి కావాల్సింది చక్కని లవ్ స్టోరీ , పైగా సినిమాలు ఎక్కువగా చూసేది వాళ్లే కాబట్టి విజయ్ దేవరకొండ కు యూత్ లో పిచ్చ క్రేజ్ ఉంది కాబట్టి తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు కరణ్ జోహార్ . కథ , కథనం కూడా బాగా నచ్చింది అందుకే రీమేక్ రైట్స్ తీసుకున్నాడు కరణ్ జోహార్ . ఈ దర్శకుడు రివ్యూ ఇచ్చేసాడు కాబట్టి డియర్ కామ్రేడ్ విజయం పక్కా అయినట్లే అని అనుకుంటున్నారు ……. కానీ అసలు తీర్పు ఇవ్వాల్సింది ప్రేక్షకులు అది ఈనెల 26 న ఇవ్వనున్నారు.