గీత గోవిందం ని మళ్ళీ వేస్తున్నారు

Vijay devarakonda's Geetha Govindam onceagain small screenవిజయ్ దేవరకొండరష్మిక మందన జంటగా నటించిన గీత గోవిందం చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే . కాగా సంచలన విజయం సాధించిన గీత గోవిందం చిత్రాన్ని బుల్లితెరపై ఇప్పటికే రెండుసార్లు ప్రసారం చేయగా రెండుసార్లు కూడా మంచి టి ఆర్ పి రేటింగ్ వచ్చింది . మొదటిసారి 20 కి పైగా రేటింగ్ రాగా రెండోసారి 17 టిఆర్ పి వచ్చింది . అంటే ఈ సినిమాకు బులితెరపై ఎంత క్రేజ్ ఉందో యిట్టె అర్ధం చేసుకోవచ్చు . అందుకే ఈ సినిమాని మళ్ళీ రేపు జీ తెలుగు వాళ్ళు ప్రసారం చేస్తున్నారు .

రేపు మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ గీత గోవిందం ప్రసారం కానుంది . విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడం ఒక కారణం అయితే ఆ జంట ని మళ్ళీ మళ్ళీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు . గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మళ్ళీ డియర్ కామ్రేడ్ చిత్రంలో జంటగా నటిస్తున్నారు .

English Title: Vijay devarakonda’s Geetha Govindam onceagain small screen