విజయ్ దేవరకొండ మాములు లవర్ కాదండోయ్


vijay devarakondas next titled world famous lover
vijay devarakondas next titled world famous lover

అవును, అనతికాలంలోనే యూత్ ఐకాన్ గా మారిన విజయ్ దేవరకొండ ఆషామాషీ లవర్ కాదు. వరల్డ్ ఫేమస్ లవర్. ఈ మాట అంటున్నది మేము కాదు, నాలుగు హీరోయిన్లు. అవును, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్, ఇజబెల్ కలిసి విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ అని డిసైడ్ చేసేసారు. ఈ పాటికే మీకు అర్ధమైపోయుంటుందిగా మనం మాట్లడుకుంటున్నది విజయ్ దేవరకొండ తర్వాతి చిత్రం గురించని.

అవును, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రానికి వరల్డ్ ఫేమస్ లవర్ అని టైటిల్ డిక్లేర్ చేసారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను సెప్టెంబర్ 20న సాయంత్రం 5 గంటలకు రివీల్ చేయనున్నారు. కెఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.