నోటా సినిమా మొత్తం లీక్


vijay devarakonda's NOTA leaked online

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా చిత్రం ఆన్ లైన్ లో లీక్ అయ్యింది . ఇప్పటికే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు దానికి తోడు ఇలా లీకుల బెడద కూడా తోడైతే ఆ సినిమా కష్టాలు చెప్పతరమా ! తెలుగు , తమిళ బాషలలో తెరకెక్కిన చిత్రం నోటా . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎక్కువగా తమిళ నేటివిటీ ఉందని , తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిప్పి కొట్టారు అయితే తమిళనాట మాత్రం కాస్త ఫరవాలేదు . నోటా చిత్రాన్ని చూస్తున్నారు తమిళ ప్రేక్షకులు దాంతో దర్శకులు ఆనంద్ శంకర్ , నిర్మాత జ్ఞానవేల్ రాజా సంతృప్తి పడ్డారు అయితే ఆ సంతృప్తి , సంతోషం ఎక్కువ రోజులు లేకుండా చేసారు ఘరానా దొంగలు . నోటా చిత్రాన్ని ఆన్ లైన్ లో లీక్ చేసి సంబర పడుతున్నారు .

నోటా చిత్రానికి మార్నింగ్ షో నుండే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కాస్త వసూళ్లు వచ్చాయంటే కారణం విజయ్ దేవరకొండ . ఈ యువ హీరోకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది దాంతో ఓపెనింగ్స్ వచ్చాయి అంతేకాదు ఓవర్ సీస్ లో సైతం మంచి వసూళ్ల ని రాబడుతోంది నోటా చిత్రం . యువ ముఖ్యమంత్రిగా విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రంలో మెహరీన్ , నాజర్ , సత్యరాజ్ లు ఇతర పాత్రల్లో నటించారు . గీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ కు పెద్ద స్పీడ్ బ్రేకర్ అయ్యింది నోటా .

English Title: vijay devarakonda’s NOTA leaked online