విజయ్ దేవరకొండ నోటా అక్టోబర్ 4న


Vijay devarakondas NOTA movie gets release dateటాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవలే గీత గోవిందం చిత్రంతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే , బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడం వల్ల ఇప్పటికి కూడా గీత గోవిందం మంచి వసూళ్లని రాబడుతోంది .గీత గోవిందం విజయంతో మంచి జోష్ మీదున్న విజయ్ దేవరకొండ తాజాగా మరో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . తెలుగు , తమిళ బాషలలో రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ” నోటా ”. కాగా ఆ చిత్రాన్ని అక్టోబర్ 4న విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు ఆ చిత్ర బృందం .

తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా విజయ్ దేవరకొండే స్వయంగా డబ్బింగ్ చెప్పాడు తన పాత్రకు . తమిళ్ పూర్తిస్థాయిలో రాకున్నప్పటికీ నిపుణుల సలహాలు తీసుకొని దిగ్విజయంగా డబ్బింగ్ ని పూర్తిచేసాడట ఈ హీరో . విజయ్ డబ్బింగ్ పట్ల దర్శక నిర్మాతలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన నోటా చిత్రం కూడా సంచలనం సృష్టించడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . ఆగస్టు లోనే గీత గోవిందంతో ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ మళ్ళీ అక్టోబర్ లో దసరా పండగకు ముందే ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు .

English Title: vijay devarakondas nota movie gets release date