టీజర్ తో దుమ్మురేపిన విజయ్ దేవరకొండ


Vijay devarakondas NOTA teaser outటాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా ” నోటా ” టీజర్ తో దుమ్మురేపాడు . తెలుగు , తమిళ బాషలలో రూపొందుతున్న చిత్రం ” నోటా ”. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ తమిళ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు . ఇక రేపు ట్రైలర్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఈరోజు 30 సెకండ్ల టీజర్ ని విడుదల చేసారు . ఆ టీజర్ లో డిఫరెంట్ డిఫరెంట్ లుక్ లో కనిపించి పిచ్చెక్కించాడు విజయ్ దేవరకొండ . రౌడీగా , రాజకీయ నాయకుడిగా , లీడర్ గా మూడు షేడ్స్ లో కనిపించనున్నాడు ఈ క్రేజీ హీరో .

రాజకీయాలంటే అసహ్యించుకునే ఓ రౌడీ లాంటి కుర్రాడు రాజకీయాల్లోకి వస్తే ఆ రాజకీయాలు ఎలా ఉంటాయన్నది విజయ్ దేవరకొండ నోటా చిత్రంలో చూపించనున్నట్లు తెలుస్తోంది . రేపు ట్రైలర్ విడుదల చేసి అక్టోబర్ 4న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . తెలుగు , తమిళ బాషలలో ఒకేసారి విడుదల కానుంది నోటా . టీజర్ తో దుమ్మురేపుతున్న ఈ హీరో ట్రైలర్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో అలాగే సినిమాతో మరెలాంటి ప్రభంజనం సృష్టించనున్నాడో చూడాలి .

English Title: Vijay devarakondas NOTA teaser out