నోటాతో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ


Vijay devarakonda's NOTA towards disaster

ఈరోజు విడుదలైన నోటాతో డిజాస్టర్ అందుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన నోటా చిత్రానికి మార్నింగ్ షో నుండే డివైడ్ టాక్ వచ్చింది.తెలుగు , తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో ఎక్కువగా తమిళ నేటివిటి ఉండటంతో తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు. ఇటీవలే గీత గోవిందం చిత్రంతో ప్రభంజనం సృష్టించాడు విజయ్ దేవరకొండ దాంతో అతడి నుండి వస్తున్న చిత్రం కావడంతో నోటా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈరోజు విడుదలైన నోటా అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యింది.

దాంతో వరుస విజయాలతో జోరుమీదున్న విజయ్ దేవరకొండకు నోటా తో బ్రేక్ పడింది. అయితే విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ మాత్రం వచ్చాయి. మరో సినిమా ఏది కూడా లేనందున మరో నాలుగు రోజులపాటు మంచి వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. యువతలో విజయ్ పట్ల క్రేజ్ ఉండటం ఒక కారణమైతే మరో సినిమా బాక్సాఫీస్ వద్ద లేకపోవడంతో ఈ నాలుగు రోజులు విజయ్ దేవరకొండదే !

English Title: Vijay devarakonda’s NOTA towards disaster