బుల్లితెరపై టాక్సీ వాలా

Vijay devarakonda's Taxi wala on small screen టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం ఈ ఆదివారం రోజున బుల్లితెరపై ప్రసారం కానుంది . ప్రముఖ ఛానల్ జీ లో వచ్చే ఆదివారం రోజున అంటే ఫిబ్రవరి 17న సాయంత్రం ప్రసారం కానుంది . ఇప్పటికే అదే ఛానల్ లో ఈ హీరో నటించిన గీత గోవిందం చిత్రాన్ని వేయగా అత్యధిక టీఆర్ పి సాధించింది .

 

ఇక టాక్సీ వాలా చిత్రం రిలీజ్ కి ముందే మొత్తం లీక్ అయ్యింది దాంతో సినిమా విజయం సాధిస్తుందా అన్న అనుమానం ఉండేది కానీ టాక్సీ వాలా రిలీజ్ అయ్యాక ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి . దాంతో టాక్సీ వాలా వెండితెర మీదనే కాదు బుల్లితెర మీద కూడా విజయం సాధించడం ఖాయమని అలాగే అత్యధిక టిఆర్ పి సాధించడం ఖాయమని ధీమాగా ఉన్నారు . విజయ్ దేవరకొండ కు అనూహ్యమైన క్రేజ్ వచ్చింది దాంతో టాక్సీ వాలా బుల్లితెర పై సంచలనం సృష్టిస్తుందో తెలియాలంటే సోమవారం వరకు ఎదురు చూడాల్సిందే .

English Title: Vijay devarakonda’s Taxi wala on small screen