25 కోట్లు వసూల్ చేసిన టాక్సీ వాలా

Vijay devarakonda's Taxiwala joins 25 crore clubవిజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీ వాలా చిత్రం 25 కోట్ల వసూళ్ల ని సాధించింది . నవంబర్ 17 న విడుదలైన టాక్సీ వాలా చిత్రం అయిదు రోజుల్లో 25 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . 25 కోట్ల గ్రాస్ రావడంతో 11 కోట్ల షేర్ తో దాదాపుగా బయ్యర్లు కూడా సేఫ్ జోన్ లోకి వచ్చారు . ఇక మిగిలినదంతా అందరికీ లాభాలే ! నోటా చిత్రంతో ఘోర పరాజయం ని మూట గట్టుకున్న విజయ్ కి ఈ సినిమా తప్పకుండా హిట్ కావాల్సిన తరుణం అయితే ఈ టాక్సీ వాలా సినిమా మొత్తం లీక్ కావడంతో సినిమా ప్లాప్ అంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి .

కట్ చేస్తే ధైర్యం కూడగట్టుకొని టాక్సీ వాలా చిత్రాన్ని నవంబర్ 17 న విడుదల చేసారు . బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడం కూడా ఈ టాక్సీ వాలా కు బాగా కలిసి వచ్చింది . దానికి తోడు విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ కూడా టాక్సీ వాలా కు బాగా ఉపయోగపడింది . మొత్తానికి మొదటి రోజునే పది కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించిన టాక్సీ వాలా మిగతా నాలుగు రోజుల్లో మరో 15 కోట్ల వసూళ్లతో మొత్తంగా 25 కోట్ల వసూళ్ల ని సాధించింది . ఓవర్ సీస్ లో సైతం మంచి వసూళ్లు సాధించాడు విజయ్ , అక్కడ హాఫ్ మిలియన్ మార్క్ ని అందుకుంది టాక్సీ వాలా .

English Title: Vijay devarakonda’s Taxiwala joins 25 crore club