మహర్షి పార్టీలో రచ్చ చేసిన విజయ్ దేవరకొండ


మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి చిత్రానికి హిట్ టాక్ రావడంతో సంతోషంగా పార్టీ చేసుకున్నారు ఆ చిత్ర బృందం . అయితే ఆ పార్టీలో హీరో విజయ్ దేవరకొండ రచ్చ రచ్చ చేసాడు . మహర్షి పార్టీలో విజయ్ దేవరకొండ ఏంటి ? అని అనుకుంటున్నారా ? నిన్న మహర్షి చిత్రం విడుదల అయ్యింది అలాగే విజయ్ దేవరకొండ పుట్టినరోజు కూడా . దాంతో ఈ పార్టీకి విజయ్ దేవరకొండ ని ఆహ్వానించారు .

ఇక ఈ హీరో రావడమే కాకుండా తన హీరోయిన్ రష్మిక మందన్న ని కూడా వెంట తీసుకొచ్చాడు . అక్కడ విజయ్ దేవరకొండ చేసిన రచ్చ కి మహర్షి టీమ్ ఫుల్ ఖుషీ అయ్యిందట ! ఎందుకంటే మహేష్ బాబు జస్ట్ కామ్ గోయింగ్ అన్న విషయం తెలిసిందే . దాంతో పార్టీలో సందడి అంతా విజయ్ దేవరకొండ దే అయ్యింది . ఈ పార్టీలో మహేష్ బాబు తో పాటుగా విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న , పూజా హెగ్డే , అశ్వినీదత్ , దిల్ రాజు , అనిల్ రావిపూడి , పివిపి , తదితరులు పాల్గొన్నారు కానీ అల్లరి నరేష్ ఎక్కడా కనిపించలేదు ఏంటో ?