ఆర్ ఎఫ్‌సీకి మారుతున్న రౌడీ సినిమా!


ఆర్ ఎఫ్‌సీకి మారుతున్న రౌడీ సినిమా!
ఆర్ ఎఫ్‌సీకి మారుతున్న రౌడీ సినిమా!

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. పూరీ క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌పై చార్మి, క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తాల‌తో క‌లిసి పూరి జ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డానికి ముందు ముంబైలో ప‌లు కీల‌క స‌న్నివేశాలు, బైక్‌పై ఛేజింగ్ స‌న్నివేశాల్ని చిత్రాల్ని చిత్రీక‌రించారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి స్పీడందుకోవ‌డంతో ముంబై షెడ్యూల్‌ని పూర్తి చేసిన చిత్ర బృందం హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చింది. లాక్‌డౌన్ కి ముందు ఈ సినిమా కోసం పూరీ ప్ర‌త్యేకంగా ముంబైలో ఆఫీస్‌ని ప్రారంభించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ముంబైలో వుండ‌టం అంత శ్రేయ‌స్క‌రం కాద‌ని భావించిన పూరీ మ‌కాం హైద‌రాబాద్‌కు మార్చిన‌ట్టు తెలిసింది. 40 రోజుల పాటు ప‌లు కీల‌క స‌న్నివేశాల్ని పూర్తి చేసిన ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ మిగ‌తా భాగాన్ని కూడా అక్క‌డే పూర్తి చేయాల‌ని భావించినా క‌రోనా కార‌ణంగా హైద‌రాబాద్‌లోని ఆర్ఎఫ్‌సీకి లొకేష‌న్‌ని మార్చార‌ట‌.

బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం కోసం భారీ సెట్స్ అవ‌స‌రం వుంద‌ట‌. దీని కోసం ఆర్ఎఫ్‌సీలో భారీ సెట్‌ని ఏర్పాటు చేస్తున్నార‌ని తెలిసింది. క‌రోనా ఎఫెక్ట్ పూర్తిగా త‌గ్గిన త‌రువాత ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల్ని ఆర్ఎప్‌సీలో ప్లాన్ చేస్తున్నారు. ర‌మ్య‌కృష్ణ‌, రోనిత్ రాయ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.